ఈ నెల 11న సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు పర్యటన ఏర్పాట్లను ప్రజాప్రతినిధులు, అధికారులు బుధవారం పరిశీలించారు. భారత తొలి విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంత్యుత్సవం సందర్భంగా ఈ నెల 11న గుంటూరులో జరగనున్న కార్యక్రమాలకు ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ళ అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు మద్దాళిగిరి, మొహమ్మద్ ముస్తఫా, మేయర్ కావటి మనోహర్ నాయుడు, రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఇంతియాజ్, కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి, జీఎంసీ కమిషనర్ కీర్తి చేకూరి, అసిస్టెంట్ కలెక్టర్ శివన్నారాయణ శర్మ సోమవారం ఏర్పాట్లను పరిశీలించారు. తొలుత పోలీస్ పరేడ్ మైదానంలోని హెలిప్యాడ్‌ను పరిశీలించారు.