ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పట్టాలు తప్పిన గూడ్స్... ఏకంగా తొమ్మిది రైళ్లు రద్దు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 09, 2022, 10:46 PM

ఇటీవల పట్టాలు తప్పిన రైలు ఘటనలు ఎక్కువవుతున్నాయి. తాజాగా రాజమండ్రి రైల్వే స్టేషన్‌లో ఓ గూడ్సు రైలు పట్టాలు తప్పడంతో రైల్వే అధికారులు 9 రైళ్లను పూర్తిగా, రెండు రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. ప్రస్తుతం రైళ్ల రాకపోకలు ఒకే ట్రాక్‌పై కొనసాగుతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ-లింగంపల్లి రైలు 2 గంటలు ఆలస్యంగా నడవనుంది. విజయవాడ-రాజమండ్రి, కాకినాడ పోర్టు- విజయవాడ  రైళ్లు పాక్షికంగా రద్దయ్యాయి.


పూర్తిగా రద్దయిన రైళ్లలో విజయవాడ-విశాఖపట్టణం (12718), విశాఖ-విజయవాడ (12717), గుంటూరు-విశాఖ (17239), విశాఖ-గుంటూరు (17240), విశాఖ-విజయవాడ (22701), విజయవాడ-విజయవాడ (22702), విజయవాడ-గుంటూరు (07628), గుంటూరు-విజయవాడ (07864), కాకినాడ పోర్ట్-విజయవాడ (17257) రైళ్లు ఉన్నాయి.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa