చలికాలం వచ్చిందంటే చాలు శరీరమంతా బద్ధకంగా ఉంటుంది. ఈ కాలంలో శరీరానికి వేడి ఎంతో అవసరం. చలిని తట్టుకునేందుకు, శరీరానికి వేడినిచ్చేందుకు ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ కాలంలో వేడి వేడి సూప్ లను తీసుకోవడం ద్వారా విటమిన్లు, ఇతర పోషకాలు లభిస్తాయి. చిలగడదుంపలు, డ్రై ఫ్రూట్స్, ఆకుపచ్చని కూరగాయలు శరీరానికి వేడినిస్తాయి. చలి ప్రభావాన్ని తట్టుకోవడంలో నెయ్యి పాత్ర కూడా ఉంటుంది.