ఉసిరికాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఔషధ గుణాలూ పుష్కలంగా ఉంటాయని నిపుణుల అభిప్రాయం. ఆయుర్వేదంలో ఉసిరి వినియోగం చాలా ఎక్కువ.దీనిలో విటమిన్ సీ, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, కెరోటిన్, బీ–కాంప్లెక్స్‌తోపాటు ఇతర విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఉసిరిని తినడం ద్వారా డయాబెటిస్ కంట్రోల్‌లో ఉంటుంది. ఉసిరితో బరువు తగ్గడంతో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.