ప్రధాని మోడీ స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపుతున్నట్లు ప్రకటన చేయాలని జి వి ఎం సి మున్సిపల్ కార్మికుల సంఘం మధురవాడ జోన్ కార్యదర్శి జీ కిరణ్ డిమాండ్ చేశారు. శుక్రవారం 5వ వార్డు మారికవలస జి వి ఎం సి కళ్యాణ మంటపం వద్ద స్టీల్ ప్లాంట్ అమ్మవద్దని కోరుతూ బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ మన ఆంధ్రప్రదేశ్ కే వెన్నుముక లాంటి భారీ పరిశ్రమ అయినా విశాఖ ఉక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. మనతోపాటు పాలక పార్టీ అయినా వైయస్సార్సీపి పైన స్టీల్ ప్లాంట్ ను కాపాడుకునే బాధ్యత ఉందని తెలియజేశారు. అందుకే మోడీ గారి చేత స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని వెంటనే ఆపుతున్నామని ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు జి విజయ్, కొండమ్మ, జయమ్మ, వి చిన్న, ఏ సత్యం సీటు జోన్ అధ్యక్షులు డీ అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.