ప్రధాని చెట్టూ ఒంటికి నల్లని సూట్లు, కళ్ళకు గాగుల్స్, ధరించి తుపాకులు పట్టుకుని చేతిలో వాకీ టాకీలు, చెవిలో ఇయర్ ఫోన్ లతో ఉన్నవారిని చూసేఉంటారు. ఇంతకీ వాళ్లవెరు? ప్రధానికి నీడలా ఉండేవీరెవరు?? వీరినే ఎఎస్పీజీఅధికారులు అంటారు. ప్రధాని భద్రతా మొత్తం వీరే చూసుకుంటారు. వారికి చాలా రకాల శిక్షణను ఇచ్చి ఎంపిక చేస్తారు. దేశ ప్రధాని భద్రతను కాపాడే బాధ్యత ఎస్పీజీ పై ఉంటుంది. వీరు మాజీ ప్రధాని, వారి కుటుంబ భద్రతను కూడా చూడాలి. ఎస్పీజీ అధికారులు ప్రధానిని నీడలా వెన్నంటి ఉండాలి. ఎస్పీజీ ప్రధాని భద్రతా ఏర్పాట్లను పరిపాలన అధికారులతో కలిసి ప్రణాళిక చేస్తుంది. ప్రధాని పర్యటనకు ముందు భద్రతను ప్రణాళిక చేసే విధానం గురించి ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి. ప్రధానికి ఎస్పీజీ భద్రత కల్పిస్తుంది. కానీ, మిగిలిన భద్రత వహించే బాధ్యత ఆ రాష్ట్ర పోలీసులది. పర్యటనకు ముందే ఎస్పీజీ బృందం రాష్ట్రానికి వెళతారు. సెక్యూరిటీ బ్యూరో, పోలీసులు, స్థానిక పరిపాలనాధికారులు కలిసి ప్రధానికి భద్రత కల్పించే బాధ్యత తీసుకుంటారు.
1988లో ఎస్పీజీ చట్టం
ఇందిరా గాంధీ ప్రభుత్వం అమృత్ సర్ లోని గోల్డెన్ టెంపుల్ దగ్గర ఆపరేషన్ బ్లూ స్టార్ మొదలుపెట్టింది. ఇందిరా గాంధీ 1984లో చేసిన ఒక ప్రసంగంలో, "ఈ రోజు నేనిక్కడ ఉన్నాను. రేపు ఉండకపోవచ్చు. కానీ, నేను బ్రతికున్నంత వరకూ నా ప్రతీ రక్తపు బొట్టును ఈ దేశాన్ని దృఢంగా చేసేందుకే వెచ్చిస్తాను" అని చెప్పారు. ఆ మరుసటి రోజే 1984 అక్టోబరు 31న ఇందిరా గాంధీ తన సొంత బాడీ గార్డుల చేతిలో కాల్పులకు గురై ప్రాణాలు కోల్పోయారు. ఆమె మరణం తర్వాత దేశ రాజధానిలో హింస చోటు చేసుకుంది. అల్లర్లు చెలరేగాయి. దీంతో, దేశవ్యాప్తంగా శాంతి భద్రతల సమస్య చర్చకొచ్చింది. 1985లో ప్రధాని భద్రత చూసేందుకు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్‌ను నియమించారు. 1988లో పార్లమెంట్ ఎస్పీజీ చట్టాన్ని ఆమోదించింది.
ఏం చేస్తారు
ప్రధాని పర్యటనకు ముందే ఆ ప్రయాణ మార్గాన్నిసుగమం చేస్తారు. ప్రధాని ప్రసంగ వేదిక దగ్గర భద్రత కల్పన, ప్రయాణంపై దృష్టి పెట్టి, ఏదైనా ఆటంకం వస్తే వెంటనే దానిని తొలగిస్తారు. ఈ ప్రణాళిక అంతా కేవలం కాగితంపై ఉండదు. పర్యటనకు ముందే మాక్ డ్రిల్ జరుగుతుంది. ప్రధాని పర్యటన, వసతికి సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేస్తారు. ప్రధాని హెలీకాఫ్టర్ పై ప్రయాణిస్తే, వాతావరణ సూచనలను ఎప్పటికప్పుడు గమనిస్తారు. ఈ నిబంధనలన్నీ ఎస్‌పీజీ బ్లూ బుక్‌లో పొందుపరిచి ఉంటాయి. ఎస్పీజీ కి రూ. 375కోట్ల వార్షిక బడ్జెట్ ఉంటుంది. దీనిని దేశంలో ప్రధాన భద్రతా కేంద్రంగా చూస్తారు.