ప్రపంచ జనాభా ఈ నెల 15 నాటికి 800 కోట్లకు చేరనున్నట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. 1950తో పోలిస్తే ఇది మూడు రెట్లు ఎక్కువని, 2030 నాటికి 850 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. ప్రస్తుతం చైనాలో ఎక్కువ జనాభా ఉందని, 2023 లో భారత్ చైనాను అధిగమిస్తుందని తెలిపింది. ప్రపంచ జనాభా 2050 నాటికి 970 కోట్లు, 2080 నాటికి వెయ్యి కోట్లు, 2100 నాటికి 1120 కోట్లు దాటుతుందని వెల్లడించింది.