షిర్డీ సాయిబాబా దర్శనం కోసం వచ్చే భక్తులకు సాయి సమాధిని స్మృశించే భాగ్యం కలగనుంది. ఇప్పటివరకు వీఐపీ భక్తులకు మాత్రమే ఈ అవకాశం ఉండగా, ఇప్పుడు సాధారణ భక్తులకు కూడా ఈ అవకాశం కల్పిస్తామని సాయి సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి భాగ్యశ్రీ బనాయత్ తెలిపారు. ఒకప్పుడు సాయి సమాధిని తాకే అవకాశం అందరికీ ఉండేది. అయితే, భక్తుల రద్దీ నేపథ్యంలో ఆ తర్వాత భక్తులకు, సాయి సమాధికి మధ్య గాజు అద్దాన్ని అడ్డుగా పెట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa