గుమ్మలక్ష్మీపురం గ్రామంలోని 104 వాహనం ఇలా విదుత్స్తంభాన్ని ఢీ కొట్టింది. వాహనం డ్యాష్ బోర్డు నుంచి ఒక్కసారిగా పాము దూసుకురావడమే ఇందుకు కారణం. దాన్ని చూసి భయాందోళన చెందిన డ్రైవర్ రాము గెంతేయడానికి ప్రయత్నించే క్రమంలో వాహనం అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. దీంతో వీధి విద్యుత్ స్తంభం కూలిపోయింది. ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వెంటనే స్థానికులు వాహనం నుంచి పామును తొలగించారు. కూలిపోయిన విద్యుత్ స్తంభాన్ని విద్యుత్ సిబ్బంది పునరుద్ధరించారు.