వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని కడప జిల్లా, బోయ వాల్మీకి సంఘ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, వీఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు నరసింహులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు తహసీల్దార్ భీమేశ్వరరావుకు గురువారం డిమాండ్ కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాల్మీకుల ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో వెను కబడ్డారని, ప్రభుత్వాలు మారుతున్న వాల్మీకులకు న్యాయం జరగడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘనాయకులు రెడ్డినరసింహు లు, జస్వంత, శివ, లోకేష్, రవి తదితరులు పాల్గొన్నారు.