మహిళా చట్టాలను పటిష్టంగా అమలుచేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళాసంఘం జిల్లా నాయకురాలు భాగ్యమ్మ, సీపీఎం జిల్లా కార్య దర్శి శ్రీనివాసులు పేర్కొన్నారు. ఐద్వా పట్టణ మహాసభను స్థానిక విజనగర్ కాలనీ లో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఐద్వా జెండాను ఆవిష్కరించి అమరులైన మహిళా నాయకురాలకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 75 ఏళ్లు స్వాతంత్య్రం వచ్చినా నేడు మహిళలపై లైంగిక వేధింపులు, దాడులు, అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఐద్వా పట్టణ మహాసభలో నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షురాలుగా సాహిన, ఉపాధ్యరాలుగా రెడ్డిరాణ, ప్రధాన కార్యదర్శి గా లక్ష్మీదేవి, సహాయకార్యదర్శిగా నసీమా, కమిటీ సభ్యులుగా ఉషారాణి, ధనలక్ష్మీ, శాంతమ్మ, ఎన్నికయ్యారు.