నేడు హిమాచల్ ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా, సిరాజ్ నియోజకవర్గంలో సీఎం జైరామ్ ఠాకూర్ కుటుంబంతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండిలోని 44వ పోలింగ్ బూత్ లో ఆయన ఓటేశారు. ఫీడ్బ్యాక్ అద్భుతంగా ఉందని, గెలుపు తమదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు శాంతియుతంగా ఓటింగ్లో పాల్గొంటున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఉదయం నుండి భారీగా ఓటింగ్ జరుగుతుంది.