ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి 1991లో చోరీ చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఎంత వెతికినా ఆచూకీ చిక్కలేదు. 1998లో అతను మరణించాడని ప్రభుత్వం జారీ చేసిన డెత్ సర్టిఫికెట్ పోలీసులకు అందడంతో వెతకడం ఆపేశారు. ఇటీవల అతడు బతికే ఉన్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. కేసు నుంచి తప్పించుకునేందుకు నిందితుడు ఫోర్జరీ సంతకంతో డెత్ సర్టిఫికెట్ సృష్టించినట్లు విచారణలో తేలింది.