బీహార్ భాగల్పూర్లోని కహల్ గావ్ రైల్వే స్టేషన్ లో ఓ వ్యక్తి పట్టాలు దాటేందుకు ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు. ఓ రైలు స్టేషన్ లో ఆగి ఉంది. ఓ ప్రయాణికుడు రైలు కింద నుండి పట్టాలు దాటేందుకు యత్నించాడు. వెంటనే రైలు కదలడంతో ఆందోళనకు గురైన ప్రయాణికుడు కదలకుండా పట్టాలపై బోర్లా పడుకున్నాడు. రైలు వెళ్లిన తర్వాత లేచి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.