కుప్పం నియోజకవర్గంలో అల్ప పీడన ప్రభావంతో శుక్రవారం నుండి ఒకటే ముసురు వాన కురుస్తోంది. ముసురు వాన ప్రభావం శనివారం కూడా కొనసాగుతోంది. ముసురు వర్షం దెబ్బకు జనం ఇళ్ళకే పరిమితం అవుతున్నారు. ఇక బంగాళదుంప, వరి, టమోటా, బీన్స్, పూల మొదలగు పంటలపై వర్షం ప్రభావం పడటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. పంటలకు అప్పు చేసి పెట్టుబడి పెట్టామని, పంటలు చేతికి వచ్చే సమయాని వర్షాలు ఎక్కువగా కురుస్తుండటంతో పెట్టుబడి సైతం రావడం లేదని రైతన్నలు దిగులు చెందుతున్నారు.