రైల్వే కోడూరులో శనివారం గాంధీ విగ్రహం వద్ద సిపిఎం కార్యకర్తలు నరేంద్ర మోడీ రాష్ట్రానికి ద్రోహం చేసినందుకు, విశాఖపట్నం వస్తున్న సందర్భంగా, విశాఖ కార్మికులను అక్రమ అరెస్టుకు నిరసనగా సిపిఎం ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించి నిరసన తెలియజేశారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్. చంద్రశేఖర్ మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని, విభజన చట్టం హామీలను అమలు చేయాలని, ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కడప, ఉక్కు పరిశ్రమనునిర్మించాలని, వెనుకబడిన రాయలసీమ ప్రాంత ప్యాకేజీ ఇవ్వాలని, రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వాలని, పోలవరం నిర్మాణానికి, నిర్వాసితులకు నిధులు ఇవ్వాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పంది కాళ్ళ మణి, సిపిఎం మండల కన్వీనర్ లింగాల యానాదయ్య, కెవిపిఎస్ జిల్లా కన్వీనర్ ఓబిలి పెంచలయ్య, సిఐటియు మండల కన్వీనర్ దాసరి జయచంద్ర పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa