నీటి బిల్లులు చెల్లించాలని అమరావతిలో నిరసన తెలపడానికి వెళ్తున్న ఎంపీటీసీలు, ఆదివారం రాత్రి వి. కోట పోలీసులు అడ్డుకొన్నారు. బాధితుల కథనం మేరకు. వైసీపీ అధికారంలోకి రాగానే వేసవిలో ప్రజల దాహార్తి తీర్చడానికి ట్రాక్టర్ల ద్వారా నీరు సరఫరా చేశారు. మూడేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు నీటి బిల్లులు చెల్లించలేదు. అమరావతిలో ఆందోళన చేయాలని వి. కోట ప్రాంత ఎంపీటీసీలు, సర్పంచులు ప్రత్యేక బస్సుల్లో పయనమయ్యారు.
![]() |
![]() |