ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది. రెండురోజులుగా ఆసుపత్రి ఆవరణలో అనుమానాస్పదంగా ఒక మహిళా ఉంటూ అదును చూసి చంటిబిడ్డను అపహరించి బయటకు వస్తుండగా అనుమానం వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. విషయం తెలిసి కుటుంబ సభ్యులు ఆ మహిళకు దేహశుద్ధి చేశారు. పొంతనలేని సమాధానం చెప్పడంతో ఏలూరు టూటౌన్ పోలీసు స్టేషన్‌కు అప్పగించారు. ఈ ఘటన ఏలూరులో ఆదివారం ఉదయం సంచలనం కలిగించింది. చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa