ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రంగంపేట సమీపంలోని శేషాచలం కొండల మధ్య ఉన్న కల్యాణి డ్యాం జలాశయం నిండుకుండలా మారింది. ఈ సందర్భంగా కల్యాణి డ్యామ్ ను చూడడానికి పర్యాటకులు, మండల ప్రజల తాకిడి పెరిగింది. ఈనీటితో నియోజకవర్గ పరిధిలోని చెరువులను నింపడానికి చర్యలు చేపడుతున్నట్లు అధికారులు చెప్పారు. డ్యామ్ నీరు ప్రవహించే పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa