పసుపు మనం వంటల్లో అతి సాధారణంగా వాడే పదార్థం. కానీ, పసుపుతో ఎన్నో ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. మెదడుకు సంబంధించిన వ్యాధులను పసుపు నివారిస్తుంది. గుండె జబ్బులు రాకుండా పసుపు మంచి ఔషధంగా పనిచేస్తుంది. అంతేకాకుండా కరోనా లాంటి ప్రమాదకర వైరస్ లు దరిచేరకుండా పసుపు కాపాడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.