ప్రపంచ జనాభాలో 36 శాతం చైనా..బారత దేశాల్లోనే ఉందని తేలింది. అయితే, 2023 నాటికి జనాభా విషయంలో భారత్... చైనాను అధిగమిస్తుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. ప్రస్తుతం చైనా జనాభా 144 కోట్లు కాగా, భారత్ జనాభా 138 కోట్లు.
ప్రపంచ జనాభా నేటితో 800 కోట్లకు చేరింది. 2011 అక్టోబరులో ప్రపంచ జనాభా 7 బిలియన్లు కాగా, 2022 నవంబరు 15తో అది 8 బిలియన్లకు పెరిగింది. కేవలం 11 ఏళ్లలోనే భూమండలంపై 100 కోట్ల జనాభా పెరిగినట్టు తాజా గణాంకాలు చెబుతున్నాయి. 1974లో 400 కోట్లుగా ఉన్న ప్రపంచ జనాభా ఈ 48 సంవత్సరాల్లో రెట్టింపైంది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి జనాభా నిధి సంస్థ వెల్లడించింది. ప్రపంచంలో చైనా, భారత్ అత్యధిక జానాభా కలిగిన దేశాలు అని తెలిసిందే.