చిట్ ఫండ్ వ్యాపార కేంద్రాలలో అధికార్లు తనిఖీలు నిర్వహించారు. ఏపీలో చిట్ ఫండ్ వ్యాపారం చేస్తున్న పలు సంస్థలకు చెందిన కార్యాలయాల్లో ఆ రాస్ట్ర రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. చిట్ ఫండ్ కార్యకలాపాల్లోని మార్గదర్శి చిట్ పండ్ తో పాటు కపిల్ చిట్ ఫండ్, శ్రీరామ్ చిట్ ఫండ్ సంస్థలకు చెందిన కార్యాలయాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. మార్గదర్శి చిట్ ఫండ్స్ ఈనాడు గ్రూపు సంస్థలకు అధినేత రామోజీరావు కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్న కంపెనీ అన్న విషయం తెలిసిందే.
చిట్ ఫండ్ ద్వారా నిధులను సేకరిస్తున్న ఆయా సంస్థలు... ఆ డబ్బును చిట్ ఫండ్ కు కాకుండా ఇతర కార్యక్రమాలకు వినియోగిస్తున్న ఆరోపణలు రావడంతో ఈ సోదాలు జరుగుతున్నట్లుగా సమాచారం. అధిక వడ్డీల ఆశ చూపి చిట్ పాడుకున్న సభ్యులకు డబ్బు ఇవ్వకుండా తమ వద్దే ఫిక్స్ డ్ డిపాజిట్ చేయించుకుంటున్న సంస్థలు... ఆ నిధులతో వడ్డీ వ్యాపారం చేస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణల ఆధారంగానే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులు ఆయా కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు.