యలమచిలి పట్టణంలో మంగళవారం సాయంత్రం పెట్రోల్ బంకు సమీపంలో అక్రమ మద్యం బాటిళ్లు తరలిస్తుండగా రేగుపాలెం గ్రామానికి చెందిన కందూరి వరప్రసాద్ అనే వ్యక్తిని అదుపులో తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఎలమంచిలి పట్టణ ఎస్సై పాపినాయుడు తెలిపారు. పట్టుబడిన యువకుడు వద్ద అయిదు మధ్యం బాటల్స్ ఉన్నట్లు తెలిపారు. ఎవరైనా అక్రమ మధ్యం కలిగి ఉన్న లేదా తరలించిన వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.