విస్టాడోమ్ కోచ్ నుండి విశాఖపట్నం-కోరాపుట్ ప్రత్యేక రైలు నడపనున్నట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎ. కె. త్రిపాఠి మంగళవారం సాయంత్రం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో రైల్వే పర్యాటకుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, ఈస్ట్ కోస్ట్ రైల్వే విస్టాడోమ్ కోచ్ సేవలను విశాఖపట్నం-కోరాపుట్-విశాఖపట్నం ప్రత్యేక రైలుకు మార్చి-2023 వరకు పొడిగించాలని నిర్ణయించిందని వెల్లడించారు. ప్రతి సోమ, బుధ, శనివారాల్లో ఈనెల 16 నుండి మార్చి 29 వరకు రైలు విశాఖపట్నం-కోరాపుట్ ప్రత్యేక రైలుకు ఒక "ఐ. సి. ఎఫ్" విస్టాడోమ్ కోచ్ జత చేయడం జరుగుతుందన్నారు.
అదేవిధంగా, విస్టాడోమ్ కోచ్ కోరాపుట్-విశాఖపట్నం రైలుకు ఈనెల 17 నుండి మార్చి 30 వరకు ప్రతి మంగళ, గురు, ఆదివారాల్లో అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సౌకర్యాన్ని ప్రజలు వినియోగించుకోవాలని డివిజనల్ రైల్వే మేనేజర్ అనుప్ సత్పతి విజ్ఞప్తి చేశారు.