బాపట్ల జిల్లా స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ , ఏపీఎస్ఆర్టీసీ బాపట్ల జిల్లా స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (సిఐటియు) ప్రథమ జిల్లా మహాసభ మంగళవారం స్థానిక ప్రజాసంఘాల కార్యాలయంలో మున్నంగి కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఎస్ డబలివ్ ఎఫ్ రాష్ట్ర నాయకులు రవిశంకర్ మాట్లాడుతూ ఆర్టీసీ ప్రభుత్వ రంగంలో బలోపేతం చేయాలని ఐర్ బస్సుల్ని కాకుండా ప్రభుత్వమే బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీలో నడపాలని కోరారు. ఆర్టీసీ సిబ్బందికి సంబంధించి పెండింగ్లో ఉన్న అన్ని సమస్యల్ని పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. కార్మికుల ఆర్థికపరమైన అన్ని సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆర్టీసీ అన్ని హాస్పిటల్స్ లో మందులు కొడత లేకుండా చూడాలని కోరారు. ఆర్టీసీ నాయకులు పి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ కార్మికులు ఐక్యంగా ఉద్యమాలు చేసి హక్కులు సాధించుకోవాలని , ఆర్టీసీలో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని కోరారు , ఈ మహాసభలో బాపట్ల డిపో మేనేజర్ డీ. శ్రీనివాస్ రెడ్డి హాజరై కార్మికులు కష్టపడి పనిచేసే సమస్త కు మంచి పేరు తేవాలని కోరారు. అనంతరం ఈ మహాసభ బాపట్ల జిల్లా నూతన కమిటీని ఎంపీక చేసుకుంది నూతన జిల్లా అధ్యక్షులుగా మున్నంగి కుమార్ , జిల్లా ప్రధాన కార్యదర్శిగా పి తిరుపతిరెడ్డి జిల్లా కోశాధికారిగా బి. శ్రీనివాసరావు జిల్లా ప్రచార కార్యదర్శిగా వి. శ్రీనివాసరావుని ఏకగ్రీవంగా ఎంపిక చేసుకుంది.