చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం పరిధిలో బుధవారం ఉదయం నియోజకవ వర్గాన్ని మంచు కమ్మేసింది. కనీసం 10 అడుగుల దూరంలో వస్తున్నటువంటి వాహనాలు కానీ ప్రజలు కానీ ఎదుటివారికి కనపడనంతగా అల్లుకుపోయింది. చలికి తట్టుకోలేక ప్రజలు వనికి పోయారు. ఈ మంచుతో శ్వాస కోసవాదులు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్యాధికారులు తెలియజేశారు. ఉదయం పూట ఏవైనా సరే అత్యవసరమైన పనులు ఉన్నట్లయితే తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రజలు తమ పనులను చూసుకోవాలని ప్రజలకు వైద్యాధికారులు తెలియజేశారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితి చిత్రంగా ఉంది ఎందుకంటే ఉదయం పూట మంచు, సాయంత్రం అయితే వర్షంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.