తిరుమలలో పోలీస్ శాఖకు చెడు పేరు తెచ్చేలా ఓ కానిస్టేబుల్ వ్యవహరించాడు. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలోకి భక్తులను అక్రమంగా పంపుతున్న కానిస్టేబుల్ ను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. క్యూలైన్ లోకి భక్తులను అక్రమంగా పంపుతున్న ఈ భాగోతం గత కొంత కాలంగా జరుగుతోంది. ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న ఈయన కొంత మందితో కలిసి ఈ దందాను ప్రారంభించాడు.
భక్తుల నుంచి నగదు తీసుకుని టికెట్లు లేకుండానే క్యూ లైన్లలోకి పంపుతున్నాడు. ఈ విషయాన్ని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. భక్తుల నుంచి నగదు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa