చైనా గూఢచారికి అమెరికాలోని సిన్సినాటి కోర్టు 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది. విమానయాన కంపెనీల ట్రేడ్ సీక్రెట్లు దొంగిలించేందుకు యత్నించాడని ఆరోపించింది. 42 ఏళ్ల యాన్జున్ జు, అమెరికన్ ఏవియేషన్ కంపెనీలను లక్ష్యంగా చేసుకున్నాడని, చైనాలో ప్రయాణించడానికి ఉద్యోగులను నియమించుకున్నాడని కోర్టు తెలిపింది. వారి ద్వారా విమానయాన కంపెనీల యాజమాన్య సమాచారాన్ని తెలుసుకునేందు యత్నించాడని కోర్టు పేర్కొంది.