ప్రకాశం జిల్లా కేంద్ర బ్యాంక్ చీరాల రీజియన్ పరిధిలోని 8 శాఖల ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపునాటికి 4 వేల కోట్ల వ్యాపార లావాదేవీలు జరపాలనేది తమ లక్ష్యమని ఆ బ్యాంకు సీఈవో సత్యవతి తెలిపారు. వేటపాలెం మండలం కొత్తపేట లోని బ్యాంక్ ప్రాంతీయశాఖ కార్యాలయంలో బుధవారం నాబార్డ్ ఆధ్వర్యంలో బ్యాంకు రీజనల్ పరిధిలోని బ్యాంకు మేనేజర్లు, సూపర్వైజర్లతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ ఎనిమిది బ్యాంక్ ల ద్వారా ఇప్పటికేవ 938 కోట్ల రూపాయల మేర వ్యాపార లావాదేవీలు జరిపామన్నారు.
ఇదే విధంగా రుణాల రికవరీ పైనా దృష్టిసారించామన్నారు. అలాగే సిబ్బందికి ఈవఆర్థిక సంవత్సరానికి సంబంధించి నిర్దేశించుకున్న లక్ష్యాలను వివరించారు. అనంతరం నాబార్డ్ అధికారి కార్తీక్ మాట్లాడుతూ నాబార్డ్ ద్వారా చేపల పెంపకం , సోలార్ యూనిట్స్ , మినీ రైస్ మిల్లులు తదితరమైన వ్యాపారాలకు రుణాలు పొందవచ్చునని చెప్పారు. ఈ కార్యక్రమంలో రీజనల్ కార్యాలయ జనరల్ మేనేజర్ రాఘవయ్య, మేనేజర్ యు. విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.