నేటి కాలంలో పిల్లల నుంచి పెద్దల వరకూ ఒక్క క్షణం కూడా మొబైల్ లేకుండా ఉండలేకపోతున్న పరిస్థితి చూస్తున్నాం. అయితే మహారాష్ట్ర.. యావత్మల్ జిల్లా బన్సీ గ్రామం సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రామంలో 18 ఏళ్ల లోపు వారు మొబైల్ వాడడాన్ని పూర్తిగా నిషేధించారు. ఈ నిర్ణయాన్ని గ్రామసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. పిల్లలు ఈ రూల్ పాటించేలా తల్లిదండ్రులు తప్పక చూడాలని సర్పంచ్ హెచ్చరించారు. లేకుంటే ఫైన్ విధిస్తామన్నారు.