అత్యాచార కేసులో అరెస్టైన శ్రీలంక క్రికెటర్ దనుష్క గుణతిలకకు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. ఆస్ట్రేలియాను విడిచి వెళ్లొద్దని అతడికి కోర్టు షరతులు విధించింది. బాధితురాలితో అసలే మాట్లాడొద్దని, డేటింగ్ యాప్‌లను వాడొద్దని ఆదేశించింది. సోషల్‌మీడియాకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. టీ20 వరల్డ్‌కప్‌లో శ్రీలంక తరపున ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లిన దనుష్క.. అక్కడ ఓ అమ్మాయిపై అత్యాచారం చేసిన విషయం తెలిసిందే.