పుట్టిన వెంటనే ఓ శిశువు గుండె ఆగిపోయింది. దీంతో వైద్యులు వెంటనే ఆ శిశువు గుండెకు సీపీఆర్ చేశారు. శిశువుకు నోటి ద్వారా శ్వాస అందించారు. శిశువును తలకిందులుగా చేసి కొట్టారు. ఎన్నో రకాలుగా ప్రయత్నించి చివరకు శిశువును బ్రతికించారు. ఆగిన గుండెను మళ్లీ కొట్టుకునేలా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శిశువును బ్రతికించిన డాక్టర్లను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.