ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విభజన చట్టానికి వ్యతిరేకంగా ప్రాజెక్టు... పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్ ఇవ్వండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 17, 2022, 10:00 PM

తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ ప్రాజెక్టుల చిచ్చు మొదలైంది. ఈ నేపథ్యంలో తెలంగాణకు చెందిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్ ఇవ్వాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)ను ఏపీ జలవనరుల శాఖ కోరింది. ఈ మేరకు కేఆర్ఎంబీకి ఏపీ జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ లేఖ రాశారు. విభజన చట్టానికి వ్యతిరేకంగా ప్రాజెక్టు చేపట్టారని ఆరోపించారు. 


ఇప్పటికే కేఆర్ఎంబీకి డీపీఆర్ ఇచ్చినట్టు తెలంగాణ చెబుతోందని వెల్లడించారు. ఈ ఏడాది సెప్టెంబరు 3న జరిగిన దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో తెలంగాణ ఈ విషయం చెప్పిందని, ఈ ప్రాజెక్టుపై అభ్యంతరాలు చెప్పేందుకు వీలుగా తమకు డీపీఆర్ కాపీ ఇవ్వాలని కేఆర్ఎంబీని కోరారు. కేఆర్ఎంబీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ప్రాజెక్టులు చేపట్టరాదని ఈ లేఖలో ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో తెలంగాణ ప్రభుత్వం అనుమతుల్లేకుండా ప్రాజెక్టులు నిర్మిస్తోందని ఆరోపించింది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com