చేయని నేరానికి తాను 32 సంవత్సరాలపాటు జైలు శిక్ష అనుభవించానని రాజీవ్ హత్య కేసు దోషుల్లో ఒకరైన నళినీ శ్రీహరన్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి చెందిన వ్యక్తినని, ఆయన హత్యకు గురైనప్పుడు తాను మూడు రోజులు ఏడ్చానని ఆమె పేర్కొన్నారు. జైలు నుంచి విడుదలయ్యాక ఆమె మాట్లాడుతూ.. ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు ఆ రోజంతా తమ కుటుంబం ఏమీ తినలేదని, నాలుగు రోజులపాటు బాధతో ఏడ్చామని అన్నారు. రాజీవ్ హత్యకు గురైనప్పుడు కూడా మూడు రోజులపాటు తాను ఏడ్చానని గుర్తు చేసుకున్నారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన తనపై రాజీవ్‌ను చంపినట్టు ఆరోపణలు ఎదుర్కొన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై వచ్చిన ఈ ఆరోపణలు తొలగిపోతేనే తనకు విశ్రాంతి అని పేర్కొన్నారు. ఈ కేసులో తాను నిర్దోషినని స్పష్టం చేసిన నళిని.. మరి ఆయన హత్య వెనక ఎవరున్నారన్న ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు నిరాకరించారు. చేయని నేరానికి తాను 32 సంవత్సరాలపాటు జైలు శిక్ష అనుభవించానని చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు.