ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆటో డ్రైవర్ తెలివికి ఫిదా అవుతున్న నేటిజన్లు

national |  Suryaa Desk  | Published : Fri, Nov 18, 2022, 12:21 AM

తెలివితేటలు ఎవడబ్బు సొత్తు కాదు అని తనదైన శైలీలో ఓ ఆటో డ్రైవర్ నిరూపించాడు. సోషల్ మీడియాలో అతను వైరల్ అయి నేటిజన్ల ప్రశంసలు పొందుతున్నాడు. ఆటోలో ఓ మహిళ తన ఎయిర్‌పాడ్స్‌ను మరిచిపోయింది. ఇక అవి పోయాయిలే అనుకుంది. కానీ.. ఊహించని విధంగా తన పేరు కూడా తెలియని ఆ ఆటో డ్రైవర్.. వెదుక్కుంటూ వెళ్లి తిరిగి అవి ఆమెకు అందేలా చేశాడు. దాంతో ఆమె ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది. ఆ ఆటో డ్రైవర్ తెలివికి.. ఇంప్రెస్ అయిపోయింది. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. షిడికా అనే మహిళ తన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.


బెంగళూరులో టెక్ సిటీలో ఉండే షిడికా... తన ఆఫీసుకు వెళ్లేందుకు ఓ ఆటో ఎక్కింది. అయితే దిగేటప్పుడు తన ఎయిర్‌పాడ్‌లను ఆటోలో మరిచిపోయింది. అవి చాలా ఖరీదైనవి. అంతటి ఖరీదైనవి పోగొట్టుకున్నానని గ్రహించిన వెంటనే షిడికా కలత చెందింది. సరే ఏం చేస్తాం లే అని... మనస్సుకు సర్ది చెప్పుకుంది. అయితే అరగంటలో ఆమె తన ఆఫీసు సెక్యూరిటీ నుంచి ఆ ఎయిర్‌పాడ్‌లను తిరిగి పొందింది. ఆ ఆటో డ్రైవర్ ఆమె ఆఫీసును తెలుసుకుని.. వాటిని అందజేశాడు. దీనికోసం ఆ ఆటో డ్రైవర్ టెక్నాలజీని వాడాడు.


షిడికా పేరును కనుగొనడానికి ఆటో డ్రైవర్ ముందుగా ఎయిర్‌పాడ్‌లను కనెక్ట్ చేశాడు. ఆమెను సంప్రదించడానికి అతను తన ఫోన్ పే లావాదేవీలను చూశాడు. గాడ్జెట్‌ను కనెక్ట్ చేయడం ద్వారా, ఫోన్‌పే ఉపయోగించడం ద్వారా ఆమె పేరును, షిడికా పనిచేసే చోటును తెలుసుకున్నాడు. అలా ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌ను ఆమెకు చేరవేశాడు. ఈ విషయాన్ని షిడికా సోషల్ మీడియాలో షేర్ చేసింది. దాంతో ట్విట్టర్ వినియోగదారులు ఆటో డ్రైవర్ తెలివికి ఫిదా అయిపోయారు. ఆటోడ్రైవర్ టెక్ నాలెడ్జ్ చాలా మందిని ఆకట్టుకుంది. ఈ పోస్ట్‌కి 8వేలకు పైగా లైక్‌లు వచ్చాయి.


ఈ సంఘటన గురించి తెలుసుకున్న వారు ఆటో డ్రైవర్‌‌పై పొగడ్తలు గుప్పిస్తున్నారు. బెంగళూరు ఆటో డ్రైవర్లు అందరికంటే ఎక్కువ సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉన్నారని ఒకరు కామెంట్ పెట్టారు. "ఇంజనీర్లు కంటే ఆటో డ్రైవర్లు ఎక్కువ సాంకేతిక ప్రియులు" అని మరొకరు వ్యాఖ్యానించారు. "అతను ప్రతి స్టార్టప్‌కు అవసరమైన హ్యాకీ జనరలిస్ట్" అని మరొక యూజర్ కామెంట్ పెట్టారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com