పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తాజాగా రోడ్డు మీద ఓ టీస్టాల్లో పకోడీలు వేశారు. ఝరాగ్రామ్‌లో ఓ కార్యక్రమానికి మమతా బెనర్జీ హాజరయ్యారు. ఆమె వెళ్తున్న క్రమంలో రోడ్డు పక్కన ఓ టీస్టాల్ కనిపించింది. వెంటనే తన కాన్వాయ్‌ను ఆపమన్నారు. కారును ఆపాక.. డైరక్ట్‌గా ఆ టీస్టాల్‌లోకి వెళ్లి స్వయంగా తన చేతులతో పకోడీలు వేశారు. తను వేసిన పకోడీలను... పేపర్లలో పెట్టి అందరికి అందజేశారు. సాక్షాత్తు సీఎంగా పకోడీలు వేయడంతో.. ఆ దుకాణం దగ్గర అందరూ గుమిగూడారు. దాంతో సందడి నెలకొంది. అయితే దీదీ ఇలా చేయడం కొత్తేం కాదు. గతంలో కూడా ఆమె ఇలాంటి పనులు చేశారు.
ఈ సందర్భంగా మమతా బెనర్జీ మీడియా మాట్లాడుతూ కేంద్రంపై నిప్పులు చెరిగారు. కేంద్రం నుంచి తమ రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను చెల్లించడం లేదని మమతా బెనర్జీ మండిపడ్డారు. బకాయిలను చెల్లించకపోతే అధికారం నుంచి దిగిపోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు రావాల్సిన నిధులను విడుదల చేయకపోతే.. రాష్ట్రం నుంచి జీఎస్టీ చెల్లింపులను నిలిపి వేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉండగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చిరు తిళ్లను అమ్మడం ఇది మొదటిసారి కాదు. ఈ ఏడాది ప్రారంభంలో డార్జిలింగ్‌లోని ఒక చిన్న స్టాల్లో మమతా మోమోలను తయారు చేశారు. అప్పుడు కూడా ఆమె ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి.