ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరన్ నియంత్రణలోకి వచ్చినప్పటికీ, చైనాలో మాత్రం ఈ తీవ్రత కొనసాగుతూనే ఉంది. చైనాలోని చాలా నగరాలు ఇప్పటికీ లాక్ డౌన్ లో కొనసాగుతున్నాయి. కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం అవలంభిస్తున్న జీరో కోవిడ్ విధానంపై చైనా ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా, క్వారంటైన్ సెంటర్ లో ఓ చిన్నారికి సమయానికి వైద్యం అందక మృతి చెందింది. దీంతో ప్రజలు ప్రభుత్వంపై మండిపడుతున్నారు.