ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. స్వచ్ఛ భారత్ లో భాగంగా ఇంటింట చెత్త సేకరించే చెత్త సేకరణ వాహనాలు మూలనపడ్డాయి. వివరాల్లోకి వెళితే శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం సచివాలయం 1లో ఉన్న చెత్త సేకరణ సైకిల్ లు దాదాపు 8 మూలన పడ్డాయి. దీంతో ప్రభుత్వ లక్ష్యం ఆచరణలో శూన్యం అన్న విధంగా తయారయింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రజాప్రతిని స్పందించి చెత్త వాహనాలను మరమ్మతులు చేయించి ఉపయోగం లోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.