గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అబ్జర్వర్‌గా విధులు నిర్వహిస్తోన్న ఓ ఐఏఎస్ అధికారిపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. తాను ఎన్నికల విధులు నిర్వహిస్తున్నానంటూ ఓ ఫొటో దిగి ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేయడమే ఆయన వేటుకు కారణం. కీలకమైన ఎన్నికల బాధ్యతలు నిర్వహిస్తూ సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టడమేంటంటూ ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన అభిషేక్ సింగ్.. అహ్మదాబాద్, బాపునగర్ నియోజకవర్గాలకు అబ్జర్వర్‌గా ఉన్నారు. ఇటీవల సోషల్‌మీడియాలో పోస్టులు చేయడంతో.. పబ్లిసిటీ ఎందకంటూ ఆయనపై వేటు వేసింది.