ప్రపంచంలోనే అతి పెద్ద టెలిస్కోప్ జేమ్స్ వెబ్ స్పేస్ ఆకాశంలో మరో అద్భుత దృశ్యాన్ని చిత్రీకరించింది. ఈ మేరకు ప్రొటోస్టార్-ఎల్ 1527 అనే నక్షత్రం ఉద్భవిస్తోన్న ఫోటోను తాజాగా నాసా విడుదల చేసింది. ఈ నక్షత్రం వయస్సు కేవలం లక్ష ఏళ్లేనని, ఇతర నక్షత్రాలతో పోలిస్తే ఇది ఇటీవలే పుట్టిందని పేర్కొంది. అయితే అది పుట్టిన సమయంలో కాస్మిక్ మేఘాల వల్ల ఈ ఫోటో ‘అవర్ గ్లాస్’లా కనిపించిందని తెలిపింది.