ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సరదగా ఈతకు వచ్చి...అనంత లోకాలకు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 18, 2022, 09:06 PM

విశాఖలోని భీమిలి బీచ్‌లో తీవ్ర విషాదం జరిగింది. సరదగా ఈతకు వెళ్లిన విద్యార్థులు సముద్రంలో గల్లంతయ్యారు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. తగరపువలస అనిట్స్ కాలేజీకి చెందిన కొంతమంది ఇంజినీరింగ్‌ విద్యార్థులు సముద్రంలోకి దిగారు. వారిలో ఇద్దరు గల్లంతయ్యారు. మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. ఈసీఈ బ్రాంచ్‌కు చెందిన సాయి, సూర్య గల్లంతైనట్టు విశాఖ పోలీసులు గుర్తించారు. గజ ఈతగాళ్ల సాయంతో.. సహాయక చర్యలు చేపట్టారు. అటు కూడా నేవీ (Navy) హెలికాప్టర్లతో గాలింపు చర్యలు చేపట్టింది. అయితే.. గల్లంతైన విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు.. కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com