తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కర్నూలులోని మౌర్య హోటల్‌లో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లా టీడీపీ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన అదనపు భవనం ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొని ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కర్నూలు టీడీపీ ఇంచార్జీ టీజీ భరత్ ఆధ్వర్యంలో 2వేల మంది వైసీపీ కార్యకర్తలు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ జగన్ పాలనలో 50 శాతం వెనుక బడిన వర్గాలకు అన్యాయం జరుగుతోందని అన్నారు. రాష్ట్రంలో ఇసుక, మద్యం, మైనింగ్ మాఫియా జరుగుతోందని ఆరోపించారు. వైసీపీ నేతలు దోపిడీ దొంగలుగా మారి దోచుకుంటున్నారని విమర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa