కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రేపు గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. దీని కోసం భారత్ జోడో యాత్రకు తాత్కాలికంగా విరామం ఇచ్చారు. రేపు సూరత్, రాజ్ కోట్ ల్లో జరిగే బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ప్రధాన పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. ఇప్పటికే ప్రధాని మోదీ సైతం ప్రచారం కోసం గుజరాత్ చేరుకున్నారు.