కర్ణాటకలోని మంగుళూరులో శనివారం జరిగిన ఆటో పేలుడు ఘటనలో ఉగ్ర కోణం అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. అది ప్రమాదవశాత్తు జరిగింది కాదని డీజీపీ ప్రవీణ్ సూద్ వెల్లడించారు. ఆటోలో ఎక్కిన వ్యక్తి చేతిలో ఉన్న బ్యాగులో ఏముందనేది తేలాల్సి ఉందన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. కాగా, పేలుడు ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa