ఢిల్లీలో శ్రద్ధావాకర్ హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఆమె స్వస్థలం మహారాష్ట్ర వసాయ్ లోనూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఓ హిందూ ముస్లిం జంట తమ రిసెప్షన్ రద్దు చేసుకుంది. వసాయ్ కు చెందిన మహిళ, ఓ ముస్లిం వ్యక్తిని పెద్దల అంగీకారంతో నవంబర్ 17న పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లిని శ్రద్ధా హత్యతో ముడిపెడుతూ.. కొంత మంది వివాద హ్యాష్ ట్యాగ్స్ తో ట్విట్టర్ లో ట్రెండ్ చేశారు. ఈ క్రమంలో వివాహ రిసెప్షన్ రద్దు చేసుకున్నారు.