రాష్ట్రంలో మూడున్నరేళ్లుగా వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు ప్రజలకు తెలిసేలా ‘ఇదేమి ఖర్మ’ కార్యక్రమాలు నిర్వహించాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాజంపేట పార్లమెంట్ టీడీపీ నేత గంటా నర హరికి సూచించారు. శనివారం మం గళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాల యంలో జరిగిన టీడీపీ సర్వసభ్య సమావేశంలో రాజంపేట పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల ఇనచార్జిలు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా వచ్చే ఎన్నికల లోపు విలువైన సమయాన్ని ప్రజల్లో గడపాలని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ గ్రామగ్రామాన విస్తృతంగా పర్యటిస్తూ ఇదేమి ఖర్మ కార్యక్రమాలను నిర్వహించాలని చంద్రబాబు సూచించారన్నారు. వైసీపీ అరాచక పాలన, అభివృద్ధిలో వెనుకబడిపోవ డం, అవినీతి, ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలందరికి తెలిసేలా పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ముందస్తు ప్రణాళికతో ఇదేమి ఖర్మ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారన్నారు. సమావేశా ల్లో ఏడు నియోజకవర్గ ఇనచార్జిలు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.