బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గరికపాటి నరసింహారావుపై చర్యలు తీసుకోవాలంటూ శనివా రం ఆ పార్టీ నాయకులు మదనపల్లె వనటౌన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బందెల గౌతమ్‌కుమార్ మాట్లాడుతూ మనువాదానికి నిలువెత్తు వికృత వచనరూపం గరికపాటి దుష్ప్రవచనాలన్నారు. మనుస్మృతిలో శూద్రులను, అతి శూద్రులను, మహిళలను అవమానించి వేధించిన స్ఫూర్తితో సామాజిక ఫాసిస్టు బోధనలు చేస్తున్నారని ఆరోపించారు. కుల దురహంకారంతో బహుజనులైన బీసీలు, ఎస్సీలను టీవీల్లో, బహిరంగ వేదికలపై అవమానించేలా దుష్ప్రవచనాలు చేస్తున్నట్లు వాపోయారు. ముఖ్యంగా మహిళలను కించపరిచేలా మాట్లాడడమే కాకుండా బీఎస్పీ అధినేత్రి మాయావతిపై ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు బాలాజీ, వేణు, బాబు, శివ, మహేష్, లక్ష్మీపతి, అనిల్, చిరు, కిరణ్, పెద్దోడు, కార్యకర్తలు పాల్గొన్నారు.