సచివాలయాల్లో లంచం అడిగితే చర్యలు తప్పవని పేదలకు ఇష్టంగా సేవలందించి సకాలంలో వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసి వారి కోసం కష్టపడాల్సిన ఉద్యోగులు కొందరు లంచాలకు ఆశపడి రోజుల కొద్దీ తిప్పుకోవడమే కాక అర్హులైనవారిని కూడా అనర్హులుగా చేయడం చూస్తుంటే అలాంటి వారిపై చర్యలు తప్పవని నాయకులూ హెచ్చరించారు. చెన్నూరులో శనివారం విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల శివాలపల్లెలో ఓ సచివాలయ ఉద్యోగి అదే గ్రామానికి చెందిన ఓ కుటుంబం దగ్గర లంచాలు డిమాండ్ చేయడం చూస్తుండడం దారుణమన్నారు. గతంలో అర్హునిగా ఉన్నవారు ఇప్పుడు అనర్హులు ఎలా అవుతారన్నారు. ఆ సచివాలయ ఉద్యోగి పట్ల ఏ మాత్రం ఉదాశీనత ఉండదని, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే మండల అధికారులు కూడా ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని తాను చెప్పడం జరుగుతుందన్నారు. భవిష్యత్తులో మరో ఉద్యోగి కూడా ఇలాంటి పనులకు పాటుపడకూడదని, విధి నిర్వహణలో మంచిగా పనిచేయాలని హెచ్చరించారు.