సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం తమిళనాడులోని అరుణాచలం శివాలయంకు హిందూపురం నుంచి భారీగా భక్తులు తరలి వెళ్ళారు. ఏపిఎస్ ఆర్టీసీ వారు కార్తీక మాసం పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ప్రత్యేక సర్వీసులకు విశేష స్పందన వచ్చిందని డిపో మేనేజర్ నరేంద్రరెడ్డి తెలిపారు. ఆదివారం హిందూపురం నుంచి అరుణాచలంకు 10 ప్రత్యేక బస్సులు బయలుదేరి వెళ్ళాయి. దీంతో బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడింది. అదే విధంగా త్రిలింగ దర్శనం కోసం సోమవారం ఉదయం 5 గంటలకు 2 బస్సులు రిజర్వేషన్ చేసుకున్నారన్నారు. డిసెంబరు 6వ తేదీన అరుణచలంలో జ్యోతి వెలిగిస్తారని జ్యోతి దర్శనంకు వేలాది మంది భక్తులు తరలి వెళ్ళారన్నారు.