కూడేరు మండల ప్రజల త్రాగునీటి కష్టాలు తిరిపోయాయి. మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి సూచనలతో నూతన త్రాగునీటి పైప్ లైన్ నిర్మాణం పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి అయ్యాయి. మండలంలో 29 గ్రామాలకు నీటి సరఫరా పునరుద్ధరించారు. గత సెప్టెంబర్ నెలలో పిఎబిఆర్ కు భారీగా వరద రావడంతో కూడేరు మండలానికి త్రాగునీటి సరఫరా చేసే పైపులైన్ వరద ఉధృతి కొట్టుకుపోయింది. 29 గ్రామాలకు త్రాగునీటి సరఫరా ఆగిపోయింది. దీంతో వరద ఆగిన వెంటనే యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టి పైపులైన్ పనులు పూర్తి చేయాలని ఆర్డబ్ల్యూఎస్, స్థానిక ప్రజాప్రతినిధులకు ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆదేశించారు. ఎంపీపీ నారాయణరెడ్డి చొరవతో రూ. 19 లక్షల రూపాయలతో 10 రోజుల్లో పైపులైన్ నిర్మాణం పనులు పూర్తి చేశారు. సోమవారం ఎంపీపీ నారాయణరెడ్డి, సర్పంచ్ చంద్రశేఖర్ యాదవ్ తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్విచ్చాన్ చేసి నీటి పంపింగ్ ప్రారంభించారు. మండలంలోని 29 గ్రామాలకు నేటి నుంచి నీటి సరఫరా ప్రారంభమౌతుందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ఫాతిమా, సూపర్వైజర్ మంజునాథ్ రెడ్డి, బైరెడ్డి రామచంద్రారెడ్డి, వడ్డే గంగాధర, బాలరాజు, నాగరాజు, రమేష్, అశోక్, ఓంకార్, శీన, రాజేష్, నవీన్, ఆనంద, వన్నూరు స్వామి, సురేష్, శివ పాల్గొన్నారు.